DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అవసరమైన పెద్ద మొక్కలను నర్సరీలలో పెంచాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అవసరమైన పెద్ద మొక్కలను నర్సరీలలో పెంచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక దుర్గానగర్ లోని అటవీ శాఖ నర్సరీని మంగళవారం ఉదయం కలెక్టర్ సందర్శించారు. నర్సరీ విస్తీర్ణం, మొక్కల పెంపకం, ఎరువుల తయారీ, తదితర అంశాలను జిల్లా అటవీ శాఖ అధికారి ని అడిగి తెలుసుకున్నారు. నర్సరీలలో పెంచుతున్న పెద్ద మొక్కలు అటవీ క్షేత్రాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో మొక్కలు నాటాలని సూచించారు. అటవీ జాతి మొక్కలు, అటవీ ఉత్పత్తులకు అవసరమైన విత్తన సేకరణ చేపట్టడం అభినందనీయమని, అటవీ శాఖ ద్వారా కాంపా నిధులతో, ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న మొక్కల పెంపకం వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో నిర్మించిన 468 వర్మీ కంపోస్ట్ కేంద్రాలలో తయారు చేస్తున్న ఎరువును పరిశీలించాలని సూచించారు. నర్సరీలలో పెంచుతున్న మొక్కలు, సేంద్రియ ఎరువుల తయారీ అంశాలపై ఎంపీడీఓ లకు శిక్షణ ఏర్పాటు చేయాలనీ జిల్లా అటవీ అధికారికి సూచించారు. జీవామృతం తయారు విధానం, మొక్కలకు స్ప్రే చేయడం వంటి వివరాలను తెలుసుకున్నారు. అంతరించి పోతున్న అడవి జాతి మొక్కలను సేకరించి పునరుద్ధరించడం జరుగుచున్నదని, అట్టి జాతి మొక్కలను పెంచి విస్తరింపజేయడం జరుగుతున్నదని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ కలెక్టర్ కు వివరించారు. ప్రైమరీ బెడ్ లలో విత్తనాలు వేసి మొక్కల పెంపకం చేపట్టడం తద్వారా ఆయా మొక్కలను వివిధ ప్రాంతాలలో నాటే విదంగా ఏర్పాటు చేయడం జరుగుచున్నదని తెలిపారు. బండ జువ్వి మొక్కలను లేత్ హౌస్ లో పెంచి ఆ మొక్కలను వివిధ ప్రాంతాలకు పంపించడం జరుగుచున్నదని తెలిపారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఆరు లక్షల వివిధ రకాల మొక్కల పెంపకం చేపడుతున్నామని ఆయన వివరించారు. నర్సరీలలో నీటి సౌలభ్యం తప్పనిసరిగా కల్పించవలసి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మియావాకి ప్లాంటేషన్ లో తిరిగి పరిశీలించారు. ఈ పర్యటనలో అటవీ రేంజ్ అధికారి గులాబీ సింగ్, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post