జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యకమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, అవసరమైన మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నాటిన మొక్కలకు వాటరింగ్ తప్పని సరిగా నిర్వహించాలని అన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమం కోసం 52 లక్షల మొక్కలను జిల్లా వ్యాప్తంగా పెంచడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సంవత్సరం 44.74 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 25 లక్షలు, అటవీ శాఖ 8 లక్షలు, మున్సిపల్ 5 లక్షలు, ITDA ఒక లక్ష, మిగితావి వివిధ శాఖలు నాటాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్ లు, మల్టి లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పెద్దమొక్కల పెంపకం, జియో ట్యాగింగ్, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమీషనర్ శైలజ, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు,మున్సిపల్ ఇంజినీర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యకమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, అవసరమైన మొక్కలను పెంచాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB -ఆదిలాబాద్ పట్టణం లోని గాంధీ పార్క్ ను సుందరంగా, పచ్చదనంతో, స్వచ్ఛతతో నిర్వహించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
-
DPRO ADB- ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్.
-
DPRO ADB- ధరణిలో కొత్త మాడ్యూల్ ని సదవినియోగం చేసుకోండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు- జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ.