DPRO ADB-తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన, స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, నటరాజ్, శిక్షణ సహాయ కలెక్టర్ పి. శ్రీజ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దేశ భక్తి, తెలంగాణ గేయాలతో తెలుగు జాతి, భాష గొప్పతనాన్ని చాటారు. తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని కళ్ళకు కట్టినట్లు విద్యార్థులు నాటికలు ప్రదర్శించి అలరింపజేశారు. చిన్నారుల భరతనాట్యం, లంబాడి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు జిల్లా లోని అదిలాబాద్, బోథ్ నియోజక వర్గాలలో అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జూన్ 2న, 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు ఘనంగా నిర్వహించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాల విజయవంతానికి తోడ్పాటును అందించాలని కోరారు. జిల్లా ఎస్పి మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రొత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యతా వేడుకలను మూడు రోజుల పాటు ప్రజల భాగస్వమ్యంతో ఘనంగా నిర్వహించామని, వజ్రోత్సవాల విజయవంతానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కవులు, కళాకారులు 112మందికి, ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులకు శాలువాలు, పూలమాలలతో కలెక్టర్, ఎస్పి లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ జోగు ప్రేమెందర్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, డి ఆర్ డి ఓ కిషన్, విద్యుత్ శాఖ ఎస్ ఈ ఉత్తమ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, డి వై ఎస్ ఓ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, పరిశ్రమల శాఖ అధికారి నాగభూషణం, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు రాజలింగు, సునీత,కృష్ణవేణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post