తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పట్లను బుధవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం, జయశంకర్ విగ్రహం వద్ద పూలతో సుందరంగా అలంకరించాలన్నారు. జిల్లాలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 8. 35 గంటలకు ఆర్అండ్ బీ అతిథి గృహ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారని, 8.40 ని.లకు తెలంగాణ చౌక్ లో ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారని అన్నారు. అనంతరం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించి, సమావేశ మందిరంలో తేనీటి విందులో పాల్గొంటారని వివరించారు. ఆయా కార్యక్రమాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.