జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల యూనిట్ లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో దళితబంధు కార్యక్రమం అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 248 మంది లబ్దిదారులకు దళితబంధు పథకానికి ఆయా శాసన సభ్యుల అంగీకారంతో ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పటివరకు 226 మంది లబ్దిదారులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేసి 209 మందికి 809.767 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమచేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 73 మందికి వ్యవసాయ అనుబంధ యూనిట్ లు, 80 మందికి రవాణా సెక్టార్, 56 మందికి ఇతర యూనిట్ సెక్టార్ లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్దిదారులను కలిసి యూనిట్ ల స్థాపన, పని తీరు, తదితర అంశాలను సమీక్షించాలని అన్నారు. దళితబంధు పథకం క్రింద మంజూరైన యూనిట్ లను విజయవంతంగా కుటుంబ ఆర్థిక స్థితిగతులను పెంపొందించే దిశగా పనిచేయాలని లబ్దిదారులకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, డిప్యూటీ సీఈఓ రాజేశ్వర్ రాథోడ్, పశు సంవర్ధక శాఖ అధికారి రంగారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB -దళితబంధు లబ్ధిదారుల యూనిట్ లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPROADB-ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB-మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుడు, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB-రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఏస్.
-
DPROADB-ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.