DPRO ADB- దళిత బంధు ప్రక్రియకు నియోజక వర్గ ప్రత్యేక అధికారుల నియామకం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

దళిత బందు పథకం అమలు పరిచేందుకు నియోజక వర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు కార్యక్రమాన్ని రాష్ట్రము లోని 118 నియోజక వర్గాలలో ప్రతి నియోజక వర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్ శాసన సభ నియోజక వర్గానికి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రాజేశ్వర్ రాథోడ్, బోథ్ నియోజక వర్గానికి అదనపు DRDO రవీందర్ రాథోడ్, ఖానాపూర్ నియోజక వర్గానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఆసిఫాబాద్ నియోజక వర్గానికి ఉట్నూర్ డివిజనల్ పంచాయితీ అధికారి బిక్షపతి లను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో అర్హత కలిగిన వంద మంది ఎస్సీ లబ్ధిదారుల కుటుంబాలను ఆయా శాసన సభ్యుల సహకారంతో ఎంపిక జాబితాను సిద్ధం చేసి ఫిబ్రవరి 5 లోగా జిల్లా ఇంచార్జి మంత్రి కి సమర్పించాలని అన్నారు. అదేవిధంగా గ్రామ, వార్డ్, మండల నియోజక వర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలనీ అన్నారు. గ్రామ, వార్డ్, మండల నియోజక వర్గాల వారీగా రిసోర్స్ పర్సన్ లను గుర్తించాలని అన్నారు. వచ్చే ఫిబ్రవరి 7 లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను బ్యాంకర్ల సహకారంతో ప్రారంభించాలని అన్నారు. వచ్చే మార్చ్ 5 లోగా లబ్ధిదారుల యూనిట్ లను గ్రౌండింగ్ అయ్యే విదంగా సమన్వయము చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post