DPRO ADB -నర్సరీలలో అవసరమైన మొక్కలు పెంచాలని, ఇంటింటి చెత్త సేకరణ చేపట్టి కంపోస్ట్ ఎరువును తయారు చేయాలి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

నర్సరీలలో అవసరమైన మొక్కలు పెంచాలని, ఇంటింటి చెత్త సేకరణ చేపట్టి కంపోస్ట్ ఎరువును తయారు చేయాలనీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం రోజున బేల మండలం సైద్ పూర్ సేగ్రిగేషన్ షెడ్ ను, నార్నూర్ మండలంలోని గుండాల, కమాన్ పూర్, మహాగావ్ లలోని నర్సరీలను, నార్నూర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నర్సరీలలో నారుకు సంబందించిన మొక్కలను పెంచాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ఉందని, వేసవి కాలం సందర్బంగా మొక్కలకు ప్రతి రోజు రెండు సార్లు నీరు పోయాలని అన్నారు. ఈ నర్సరీలలో పెంచే మొక్కలను హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా తడి, పొడి ను విడివిడిగా సేకరించి సేగ్రిగేషన్ షెడ్ కు తరలించి కంపోస్ట్ ఎరువును తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. నార్నూర్ పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న మొక్కలకు ప్రతి రోజు వాటరింగ్ చేపట్టాలని, పచ్చదనాన్ని శాశ్వతంగా ఉండేలా సుందరంగా తీర్చి దిద్దాలని అన్నారు. ప్రకృతి వనాలు ఆహ్లాద పరిచే విధంగా తయారు చేసినందుకు ఆయన అభినందించారు. ఆయన వెంట మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post