DPRO ADB-నర్సింగ్ కళాశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

నర్సింగ్ కళాశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ అర్బన్ మండలం అనుకుంట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 73 భూమిని ఆమె పరిశీలించి, జిల్లాకు మంజూరైనా నర్సింగ్ కళాశాల నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని గుర్తించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రాథోడ్ రమేష్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తహసీల్దార్ శివరాజ్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post