DPRO ADB- పంటల సాగుకు లాభసాటి సలహాలు అందించాలి- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్.

రైతులు పండించే పంటల సాగుకు, దిగుబడికి లాభసాటి సలహాలు, సూచనలు సకాలంలో అందించాలని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరం లో వ్యవసాయ శాఖ క్షేత్ర అధికారులకు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య ప్రణాళిక శాఖ ద్వారా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పండించే పంటలలో సమస్యలు తలెత్తకుండా వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది పంటల సాగు సమయంలోనే అందించాలని, పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు, వినియోగించాల్సిన రసాయనాలు, పంట దిగుబడి సమయానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు వివరించిన పద్దతులను రైతులకు క్షేత్ర స్థాయిలో తెలియజేయాలని అన్నారు. పంటల సాగులో రైతుల ఆర్థికాభివృద్ధి పెరిగే విధంగా మార్గదర్శన చేయాలనీ అన్నారు. జిల్లాలో పత్తి, సోయాబీన్ పంటలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుందని, ఆయా పంటల సాగుకు సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు పండించే పంటల వివరాలను సక్రమంగా, పారదర్శకంగా నమోదు చేయాలనీ అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో రైతులకు పంటల సాగు పై అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పంటల సాగు వివరాలను రైతుల పంట పొలాలను పరిశీలించి నమోదు చేయాలనీ అన్నారు. అంతకుముందు శాస్త్రవేత్తలు రాజశేఖర్, ప్రణాళిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ లు పంటల సాగు, చీడ పీడల వలన తీసుకోవలసిన జాగ్రత్తలు, వినియోగించాల్సిన రసాయనాలు, పంటకోతల ప్రయోగాలు, తదితర అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకట రమణ, సహాయ సంచాలకులు రమేష్, ఏఓలు, మండల వ్యవసాయ, విస్తరణ, గణాంకా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post