పంట దిగుబడి అంచనాల సర్వే ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ, మండల ప్రణాళిక, గణాంక అధికారులకు పంట కోత ప్రయోగాలకు సంబందించిన (CCE KIT) యంత్ర సామగ్రిని ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంట కోత ప్రయోగాలను వ్యవసాయ విస్తరణ, మండల ప్రణాళిక, గణాంక అధికారులు సంయుక్తంగా సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు చొప్పున సిసిఇ కిట్ లను మంజూరు చేసిందని అన్నారు. బరువు కొలిచే యంత్రం, దిక్సూచి, టార్పాలిన్, కిట్ బ్యాగ్, పంట కోత నమోదు కార్డు కలిగిన కిట్ లను జిల్లాలోని 18 మండలాలకు రెండు చొప్పున 36 సిసిఇ కిట్ లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకట రమణ, సిబ్బంది నరేష్, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB-పంట దిగుబడి అంచనాల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.