DPRO ADB – పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుద్యం, పచ్చదనం పై ప్రత్యేక ఫోకస్ కనబరచండి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నంబర్ 21 లోని భాగ్యనగర్, క్రాంతినగర్ లలో పాదయాత్ర నిర్వహించి పారిశుద్యం, పార్క్ ల ఏర్పాటు స్థలాలు, విద్యుత్ స్తంభాల మార్పు, తదితర పనులను మున్సిపల్ చైర్మన్, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, వార్డ్ కౌన్సిలర్ లతో కలిసి పరిశీలించారు. మొదట స్మశానవాటిక లో కలెక్టర్ మొక్కలను నాటారు. స్మశాన వాటికలో పట్టణ ప్రగతిలో భాగంగా కోటిన్నర నిధులతో ఐదు బర్నింగ్ ప్లేట్ ఫామ్ లు, రెండు వైకుంఠ రథాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్మశానవాటికలో కనీస వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, గ్రీనరీ కోసం మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. అనంతరం వార్డులోని కాలనిలో పాదయాత్ర నిర్వహిస్తూ శానిటేషన్ పనులను పరిశీలించారు. మున్సిపల్ ఆధీనంలోని ఖాళీ స్థలాల్లో వీలును బట్టి ఒకటి, రెండు, మల్టి లేయర్ వరుసలలో మొక్కలను నాటాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. వార్డ్ ప్రణాలికను తయారు చేసుకోవడంతో పాటు ఆయా పనులను ప్రారంభించడం జరుగుతుందని, పట్టణ ప్రగతి కార్యక్రమం 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులోని కాలనీలలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శానిటేషన్ పై ప్రత్యేక ఫోకస్ తీసుకుంటున్నామని తెలిపారు. కాలనిలో కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి అవసరమైన భూమిని కేటాయించాలని, గ్రేవ్ యార్డ్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, పట్టణ ప్రగతిలో శానిటేషన్ తో పాటు పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం పై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మునిసిపల్ కమీషనర్ శైలజ, వార్డ్ కౌన్సిలర్ కే.మీనా, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post