DPRO ADB- పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి- శాసన సభ్యులు జోగు రామన్న

జూన్ 3 నుండి 15 రోజుల పాటు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని శాసన సభ్యులు జోగు రామన్న అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు పై వార్డు కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ సమస్యలను వార్డుల వారీగా కౌన్సిలర్లు వివిరించారు. అనంతరం శాసన సభ్యులు మాట్లాడుతూ, పట్టణం లో జూన్ మూడు నుండి నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజలు, కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో వంద శాతం విజయవంతానికి కృషి చేయాలనీ సూచించారు. ప్రతి వార్డులో ప్రజలు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారుల సమక్షంలో సభలు నిర్వహించి చేపట్టవలసిన పనులపై నివేదికలు తయారుచేయాలని అన్నారు. పట్టణంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, రోడ్లు, డ్రైనేజీలను శుభ్ర పరచాలని సూచించారు. హరితహారంలో భాగంగా వార్డుల వారీగా మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించి, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, స్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలలో విరివిగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పవర్ డే నిర్వహించి, లూస్ వైర్, త్రి ఫెస్ లైన్, తదితర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని ఆదేశించారు. ప్లాస్టిక్ బ్యాన్ ను వందశాతం అమలు పరచాలని అన్నారు. వ్యాపార సముదాయాల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నిబంధనలు అతిక్రమిచ్చిన వారిపై అపరాధ రుసుము వసూలు చేయాలన్నారు. ప్రతిరోజూ తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠధామలలో మిషన్ భగీరథ నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, వార్డు ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, అంతర్గత రోడ్లు, పట్టణ ప్రధాన రోడ్లకు ఇరువైపులా హరితహారం కార్యక్రమం క్రింద మల్టీ లేయర్ పద్ధతిలో మొక్కలు నాటాలని అన్నారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు, వార్డుల వారీగా సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, వైస్ ఛైర్మెన్ జహీర్ రంజని, విద్యుత్ శాఖ ఎస్ ఈ ఉత్తమ్ జాడే, వార్డుల ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post