పట్టుదల, కృషి, సాధన ద్వారా ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున స్థానిక బిసి స్టడీ సర్కిల్ లో నిర్వహిస్తున్న పోలీస్, గ్రూప్స్-1 ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడం, ఉద్యోగ నియామకాలకు అవసరమైన ఉచిత శిక్షణను ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల ద్వారా అందించడం జరుగుతున్నదని, వాటిని సద్వినియోగ పరచుకొని ఉద్యోగాలను సంపాదించుకోవాలని అన్నారు. శిక్షణలో ఫ్యాకల్టీ బోధించిన అంశాలను కఠిన సాధన చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువత ఈ శిక్షణలో పాల్గొనడం జరిగిందని, వందశాతం హాజరు కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పోటీ తత్త్వం పెరిగిందని, కఠోర సాధన, ప్రణాళికలతో ప్రస్తుత అంశాలపై అధ్యయనం, రివిజన్ చేసుకోవాలని అన్నారు. పరీక్షకు ఏ విధంగా సన్నధం కావాలి, విద్యార్థులను ఏ ప్రోత్సహించాలి అనే అంశాలను ఫ్యాకల్టీ విస్తరిస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా సహకరిస్తుందని తెలియజేస్తూ అల్ ది బెస్ట్ అని విద్యార్థులకు భరోసా కల్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం మాట్లాడుతూ, గ్రూప్ 1 విద్యార్థులకు మూడు నెలల పాటు 5000 రూపాయల చొప్పున, ఎస్ఐ, కానిస్టేబుల్ విద్యార్థులకు రెండు నెలల పాటు 2000 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి తరగతిలో వంద మంది చొప్పున విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లకు యువత సన్నద్ధం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, వివిధ అంశాలపై ప్రచురిస్తున్న తెలంగాణ మాస పత్రికను ప్రతి ఒక్కరు చదవాలని సూచించారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4500 మంది అభ్యర్థులు ఉచిత కోచింగ్ లకు దరఖాస్తు చేసుకోగా వంద మంది చొప్పున గ్రూప్ 1, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక చేసి ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రూప్ 1, ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ తరగతి గదులను, గ్రంథాలయాలను కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ సిబ్బంది, ఫ్యాకల్టీ లు, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- పట్టుదల, కృషి, సాధన ద్వారా ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
ITDA UTNOOR: గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
-
DPROADB- ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB- అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పి.ఎస్.
-
DPRO ADB: పట్టణ ప్రజలు తమ ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.