DPRO ADB- పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారాన్ని అందించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారాన్ని అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం రోజున బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన సామాజిక అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పోషకాహారాన్ని అంగన్వాడీ లోని పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు అందించాలని అన్నారు. పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు ఉండే విధంగా సమతుల్యం చేస్తూ బాలామృతం అందించాలని అన్నారు. రక్త హీనతతో బాధ పడుతున్న పిల్లలకు ఐరన్ మాత్రలు, గర్భిణీలకు ఐరన్ మాత్రలు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించాలని అన్నారు. గ్రామాలలో పిల్లల ఎదుగుదలను పంచాయితీ కార్యదర్శులు, సర్పంచ్ లు అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి బుధవారం నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. సామ్-మామ్ పిల్లలను గుర్తించి ఎదుగుదల లేని పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి డాక్టర్ల నేతృత్వంలో పౌష్టికాహారం అందించాలని అన్నారు. అలాగే గర్భిణీలకు ప్రసవ సమయంలో రక్త హీనతతో బాధ పడకుండా ముందస్తు పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం ఇచ్చోడ మండలం ఆడేగావ్ గ్రామంలో అనధికార లే అవుట్ లను పరిశీలించి అనుమతి లేకుండా లే అవుట్ లను ఏర్పాటు చేసినందుకు సంబంధిత భూ యజమానికి నోటీసు జారీ చేసి బండ రాళ్లను తొలగించాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సామాజిక సదస్సులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ, ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలలో సమావేశం నిర్వహించి పిల్లల ఎదుగుదల, గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలపై సర్పంచ్ లు పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాలలో ఏ ఒక్కరు కూడా పౌష్టికాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, సఖి కేంద్రం పరిపాలనాధికారి యశోద, ఎంపీఓ, సర్పంచ్, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయితీ కార్యదర్శులు, ఆశాలు, ANM లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post