DPRO ADB – పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జూన్ మూడు నుండి నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సూచించించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధరణి, దళిత బంధు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, హరితహారం, తదితర కార్యక్రమాల అమలుకు చేపట్టనున్న చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జూన్ మూడు నుండి నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వంద శాతం విజయవంతానికి కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమాలను జూన్ మూడవ తేదీ నుండి 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో గ్రామసభలు నిర్వహించి చేపట్టవలసిన పనులపై నివేదికను తయారుచేయాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, రోడ్లు, డ్రైనేజీల ను శుభ్ర పరచాలని అన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాలవారిగా మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించి, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, స్మశానవాటికలు, రైతువేదికలు, చెరువులు, కాలువలు, గ్రామీణ క్రీడ ప్రాంగణాలకు గుర్తించిన స్థలాలలో విరివిగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పవర్ డే నిర్వహించి, లూస్ వైర్, త్రి ఫెస్ లైన్, తదితర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ బ్యాన్ ను వందశాతం అమలు పరచాలని అన్నారు. తడి, పొడి చెత్తను సేకరించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలనీ అన్నారు. వైకుంఠధామలలో మిషన్ భగీరథ నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన చేయకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, ఇంకను మరుగుదొడ్లు లేని వారికీ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. బహిరంగ మలవిసర్జన చేసే వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలనీ అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె పకృతి వనాలు, జాతీయ రోడ్లు, అంతర్గత రోడ్లు, తదితర రోడ్లకు ఇరువైపులా హరితహారం కార్యక్రమం క్రింద మల్టి లేయర్ పద్దతిలో మొక్కలు నాటాలని అన్నారు. జిల్లాలో 300 కిలో మీటర్ల మేర మల్టి లేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని అన్నారు. పది శాతం గ్రీన్ బడ్జెట్ ను మొక్కల పెంపకం, సంరక్షణకు వినియోగించుకోవాలని అన్నారు. పబ్లిక్ టాయిలెట్ లను ప్రజలకు అందుబాటులో ఉంచి నిర్వహణ చేపట్టాలన్నారు. జిల్లాలో 1176 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి అనువైన భూములను గుర్తించాలని అన్నారు. ఇప్పటివరకు 478 క్రీడా ప్రాంగణాలకు భూములను గుర్తించడం జరిగిందని తెలిపారు. వచ్చే జూన్ నాటికి జిల్లాలోని 17 మండలాల్లో 34 గ్రామపంచాయితీ పరిధిలలో భూములను గుర్తించి ఉపాధి హామీ పథకం క్రింద భూములను చదును చేసి బయో ఫెన్సింగ్, తదితర ఏర్పాట్లను పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలనీ అన్నారు. ప్రతి ప్రాంగణానికి 50 వేల రూపాయల విలువగల క్రీడా కిట్స్ అందించడం జరుగుతుందని, గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయాలనీ అన్నారు. జూన్ 2 న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, వేసవి దృష్ట్యా ఉదయం 9 నుండి 10 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించడం, సాయంత్రం వేళ కవి సమ్మేళనం నిర్వహించాలని అన్నారు. ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న 10 వ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రతి కేంద్రంలో సంబంధిత మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి సెల్ ఫోన్ నెంబర్లతో పాటు, పరీక్షల సమయంలో చేయవలసినవి, చేయకూడనివి సూచనలు తెలిపే విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలనీ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08732 -226434 కు ఏమైనా సమస్యలు, సమాచారం తెలియజేయవచ్చని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రతి బుధవారం సందర్శించి సామ్-మామ్ పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నదళితబంధు పథకంలో భాగంగా 248 లబ్దిదారులకు గాను 232 యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన 16 యూనిట్లను వారంలోగా గ్రౌండింగ్ చేయాలనీ సూచించారు. ప్రతి నియోజక వర్గంలో మరో 1500 మంది లబ్ధిదారుల జాబితాలను ఆయా శాసన సభ్యుల నుండి తీసుకోవాలని సూచించారు. జిఓ నెం.58, 59 ఆధారంగా భూముల క్రమబద్దీకరణకు అందిన దరఖాస్తులను టీమ్ లు పరిశీలించి నివేదిక సమర్పించాలని అన్నారు. జిఓ నెం.58 కింద 801, జిఓ నెం.59 కింద 724 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, మునిసిపల్ కమీషనర్ శైలజ, జిల్లా అధికారులు, తహసీలార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post