DPRO ADB – పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి- రాష్ట్ర మంత్రులు ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్

సహజసిద్ధమైన పర్యావరణాన్ని ఆస్వాదించడానికి, ఆరోగ్య సంరక్షణకు పల్లె పకృతి వనాలు ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం రోజున నార్నూర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పల్లె వాతావరణం అభివృద్ధి చెందాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సేగ్రిగేషన్ షెడ్, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం సంతరించుకుంటున్నాయని, రాష్ట్ర, జాతీయ రహదారులకు ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడం జరిగిందని అన్నారు. పల్లె ప్రకృతి వనాల ద్వారా వివిధ వర్గాల ప్రజాలకు ఆహ్లాదం, నడక వ్యాయామం చేసుకోవడానికి, పిల్లలకు ఆటవిడుపు కేంద్రాలకు నిలయం అయ్యాయని వివరించారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో తిరిగి సుందరంగా తీర్చిదిద్దినందుకు అధికారులను, సర్పంచ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ లు రాథోడ్ జనార్దన్, కోవా లక్ష్మి, ఎమ్యెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపూరావు, మాజీ ఎంపీ గెడం నగేష్, స్థానిక సర్పంచ్ గజానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post