DPRO ADB -పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున నేరడిగొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సేగ్రిగేషన్ షెడ్, బోథ్ ఎక్స్ రోడ్ లోని పట్టణ పార్క్ ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 20 నుండి వచ్చే నెల 5 వరకు జరుగనున్న పల్లె ప్రగతి కార్యకమానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద నేరడి గొండ మండల ప్రజా పరిషత్ పాఠశాల లో ప్రతిపాదించిన పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఎక్జి క్యూటివ్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. గ్రామపంచాయితీ నిధులతో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్ లను ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని, చెట్టు నుండి రాలిపోయిన ఆకులను ప్రతి రోజు పంచాయితీ ట్రాక్టర్ ద్వారా సేగ్రిగేషన్ షెడ్ లకు తరలించాలని, పీహెచ్ సి ఆవరణలో గ్రీనరీని పెంచాలని సర్పంచ్ కు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో వైద్యున్ని నియమించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. అవసరమైన వాషింగ్, క్లీనింగ్ లకు గ్రామపంచాయితీ నిధులతో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం ఎక్కువగా చేపట్టాలని, జర్మినేషన్ తక్కువగా ఉందని, హరితహారం కు కావలసిన మొక్కలను నర్సరీలలో పెంచాలని అన్నారు. తరువాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలకు నీరును పోశారు. వేసవి సందర్బంగా ప్రతి రోజు మొక్కలకు నీటిని పోయించాలని, మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని అన్నారు. అనంతరం సేగ్రిగేషన్ షెడ్ ను సందర్శించిన కలెక్టర్ గ్రామంలోని తడి, పొడి చెత్తను సేకరించి సేగ్రిగేషన్ షెడ్ కు తరలించి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలనీ అన్నారు. అనంతరం బోథ్ ఎక్స్ రోడ్ లోని అర్బన్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించి పార్క్ లో 3.40 లక్షల మొక్కలు నాటడానికి అవసరమైన గుంతలు సిద్ధం చేసుకొని హరితహారం కార్యక్రమం నాటికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జడ్పీటీసీ అనిల్ జాదవ్, ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పి.వెంకటరమణ, మండల ప్రత్యేక అధికారి రవి శంకర్, ఎంపీఓ శోభా, పంచాయితీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post