DPRO ADB – పిల్లలు ప్రతిభావంతులుగా ఎదగాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలోని పిల్లలందరూ ప్రతిభావంతులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, ఆటపాటలు, నృత్యాలు వంటి అంశాలపై ప్రతిభ కనబరచాలని అన్నారు. ప్రతి రోజు పిల్లల దినోత్సవమేనని అన్నారు. బాల్య వివాహాలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అర్థవంతంగా ఉందని అభివర్ణించారు. అంతకు ముందు విద్యార్థులు నాటికలు, నృత్యాలను ప్రదర్శించారు. మెజీషియన్ తిరునగరి సుధాకర్ స్వామి మ్యాజిక్ ద్వారా ప్రదర్శించిన పూల బొకేను కలెక్టర్ కు అందజేశారు. అనంతరం పిల్లలతో కేక్ ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా విద్య శాఖ అధికారి ప్రణీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, CWC కమిటీ సభ్యులు, వెంకటేశ్వర్లు, షమీద ఉల్లా ఖాన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post