DPRO ADB- పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఈ నెల 10 న ఎమ్యెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం రోజున జిల్లా పరిషత్ కార్యాలయం లోని పోలింగ్ కేంద్రం ను, టీటీడీసీ లోని పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కేంద్రాల లోని ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, పోలింగ్ నిర్వహణకు కావలసిన త్రాగునీరు, ఫర్నిచర్, ఇతర వసతులను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. టీటీడీసీ లో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.

Share This Post