DPRO ADB- ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలనీ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆసిఫాబాద్ శాసన సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామప్రజలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. నర్సరీని పరిశీలించి, వీధుల గుండా పాద యాత్ర నిర్వహించి మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ప్రతి రోజు శుభ్రపరచాలని అన్నారు. హరితహారం మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. దళిత బంధు, రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, KCR కిట్, ఆసరా పింఛన్లు వంటి వినూత్న పథకాలను అమలు పరుస్తున్నదని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కై ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో భాగస్వాములై పలు అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి చేపట్టవలసిన పనులను పల్లె ప్రగతి లో చేపట్టాలని, గతంలో చేసిన పనులు, సాధించిన పురోగతి, మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో సిజినల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచుకోవాలన్నారు. హరితహారంలో విరివిరిగా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, సెగ్రి గేషన్ షెడ్, డంపింగ్ యార్డ్, మిషన్ భగీరథ పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. సిసి రోడ్లు, ధరణి, విరాసత్ భూసంబంధిత సమస్యలను పరిష్కరించాలన్నారు. గిరిజన రైతులకు గిరివికాసం పథకంలో బోరుబావులను మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయాలన్నారు. శాసన సభ్యులు ఆత్రం సక్కు మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న సమస్యలను పల్లె ప్రగతిలో పరిష్కరించాలన్నారు. అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని అన్నారు. గ్రామసభలు నిర్వహించి చేపట్టనున్న పనులను వివరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిమ గిరిజనుల అభివృద్ధి సలహా మండలి చైర్మన్ లక్కే రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, సర్పంచ్ రాథోడ్ సావిందర్, ప్రజాప్రతినిధులు , అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post