DPRO ADB-ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి- ఆర్డీఓ రాథోడ్ రమేష్.

ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ రాథోడ్ రమేష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ధరణి, ఉపాధి, ఫించన్లు, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రజావాణిలో లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ శైలజ, కలెక్టరేట్ ఏఓ అరవింద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post