ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ప్రజావాణిలో భాగంగా దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ధరణి, ఉపాధి, ఫించన్లు, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు ఒకే సమస్యపై మళ్ళి మళ్ళి ప్రజావాణికి రావద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు, రెండు పడక గదుల ఇళ్ల కొరకు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని అన్నారు. శాఖల వారిగా ఇప్పటి వరకు వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలనీ అన్నారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్ ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమీషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB-ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
You might also like:
-
DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.