ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ తో కలిసి ఆయన ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. ఫించన్లు, భూసంబంధిత, ఉపాధి, ధరణి, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు దరఖాస్తులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆసరా ఫించన్లను అర్హులైన లబ్దిదారులకు నిబంధనల ప్రకారం మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. శాఖల వారిగా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలనీ అన్నారు. ఈ ప్రజావాణిలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.