DPRO ADB- ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా, జవాబు దారితనంతో పని చేయాలి- అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్.

ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా, జవాబు దారితనంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సభ్యులతో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ జవాబుదారీతనం, పారదర్శకత, సరైన పనితీరును నిర్ధారించడం విజిలెన్స్ కమిటీ ప్రధాన లక్ష్యం అన్నారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలో కలెక్టర్ అధ్యక్షులుగా, పౌరసరఫరాల శాఖ అధికారి కన్వీనర్ గా, జిల్లా అధికారులు, డీలర్స్ సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ జాతీయ ఆహార భద్రతా చట్టం అమలును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన, తదితర సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లాలో ఒక లక్షా 92 వేల 893 రేషన్ కార్డులున్నాయని, ప్రతి నెల 6798 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి నెల 550 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ను 1538 వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ శాఖల వసతి గృహాలకు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి సునీతకుమారి, జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post