DPRO ADB -ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలి- అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్.

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. భూసంబంధిత, ఉపాధి, ఫించన్లు, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అర్జీల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల వారిగా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. జిల్లా గ్రంథాలయంలో మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ల మంజూరుకు వార్డులు, గ్రామ సభలలో దరఖాస్తు ఇవ్వాలన్నారు. ప్రజావాణిలో జడ్పీ సీఈఓ గణపతి, LDM చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post