DPRO ADB – ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలకై ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని, కేంద్రీయ విద్యాలయం, కేజీబీవీ, మోడల్ స్కూల్, తదితర విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రవేశాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ధరణి, ఉపాధి, ఫించన్లు, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, దళిత బంధు, ఉద్యోగ అవకాశాల కై ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్ లు ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో ఆర్డీఓ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, LDM చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post