DPRO ADB-ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజలనుండి ఆమె అర్జీలను స్వీకరించారు. భూసంబంధిత, వైద్యం, ఉపాధి, ఫించన్లు, రెండు పడక గదుల ఇళ్ల మంజురు తదితర సమస్యలపై దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అర్జీలను పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని అన్నారు. శాఖల వారిగా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, డిఆర్డిఓ కిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post