ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6, 7, 27, 28 తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకొనుటకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని తెలిపారు. పేరు, చిరునామాలలో సవరణలు, ఓటర్ జాబితాలో పేరు ఒక చోటు నుండి అదే నియోజక వర్గంలో మరోచోటుకు నివాసము మార్పునకు దరఖాస్తులను సంబంధిత ఫారాలలో నమోదు చేసి సంబంధిత బూత్ స్థాయి అధికారికి అందజేయాలని తెలిపారు.
* మొట్ట మొదటి సారిగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు ఫారం నంబర్ –6.
* ఓటర్ జాబితాలో ఇతర వ్యక్తి పేరు అభ్యంతరం/స్వంత పేరు తొలగింపు కోరుతూ/ మరణించినచో ఫారం నంబర్ –7.
* ఓటర్ జాబితాలో చేర్చిన వివరములు సవరణ కొరకు ఫారం నంబర్ –8.
* ఓటర్ జాబితాలో పేరును ఒకచోటు నుండి నియోజక వర్గములోని మరో చోటుకు నివాసము మారినపుడు ఫారం నంబర్- 8ఏ.
లలో పూర్తి వివరములలో సంబంధిత ఫారాలను ఆయా బూత్ లెవల్ అధికారికి సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.