DPRO ADB- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం అదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి గ్రామపంచాయతీ లో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో శాసన సభ్యులు జోగు రామన్న తో కలిసి ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామ వీధుల గుండా పాదయాత్ర చేస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించడం గురించి, తడి చెత్త పొడి చెత్త సేకరణ, ట్రాక్టర్ వినియోగం, నీటి సరఫరా, మురుగు కాలువలు నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు, పల్లె ప్రకృతి వనం, పాఠశాల విద్య, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. అనంతరం పాఠశాల ప్రాంగణం లో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని కాపాడేలా, పచ్చదనాన్ని పెంపొందించేలా పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు మరుగుదొడ్లను వినియోగించాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, గ్రామాలలో ప్రతి రోజు తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని అన్నారు. ఇప్పటికే గ్రామంలో వైకుంఠధామం, సేగ్రిగేషన్ షెడ్, ట్రాక్టర్, ట్యాంకర్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన తంతోలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. మంజూరైన తెలంగాణ క్రీడా ప్రాంగణానికి వెంటనే స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించాలని అన్నారు. ప్రజల సమస్యలైనా విద్యుత్, త్రాగు నీరు, పింఛన్లు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, విద్య్త్ శాఖ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం అదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి గ్రామపంచాయతీ లో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో శాసన సభ్యులు జోగు రామన్న తో కలిసి ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామ వీధుల గుండా పాదయాత్ర చేస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించడం గురించి, తడి చెత్త పొడి చెత్త సేకరణ, ట్రాక్టర్ వినియోగం, నీటి సరఫరా, మురుగు కాలువలు నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు, పల్లె ప్రకృతి వనం, పాఠశాల విద్య, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. అనంతరం పాఠశాల ప్రాంగణం లో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని కాపాడేలా, పచ్చదనాన్ని పెంపొందించేలా పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు మరుగుదొడ్లను వినియోగించాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, గ్రామాలలో ప్రతి రోజు తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని అన్నారు. ఇప్పటికే గ్రామంలో వైకుంఠధామం, సేగ్రిగేషన్ షెడ్, ట్రాక్టర్, ట్యాంకర్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన తంతోలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. మంజూరైన తెలంగాణ క్రీడా ప్రాంగణానికి వెంటనే స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించాలని అన్నారు. ప్రజల సమస్యలైనా విద్యుత్, త్రాగు నీరు, పింఛన్లు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ లక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post