DPRO ADB-ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 3 నుండి 30 వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జూన్ 1, 2 తేదీల్లో ముందస్తు సమావేశాలు, ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం, 3 నుండి 10 వ తేదీ వరకు గ్రామాలు, హాబిటేషన్ లలో బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం, 13 నుండి 30 వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 13 న విద్యార్థులు పోషకులతో సమావేశం నిర్వహించి మన ఊరు-మన బడి కార్యక్రమ విషయాలు తెలియజేయడం, అలాగే పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై విద్యార్థులు తల్లితండ్రులకు తెలియజేయాలని అన్నారు. 14 న ఆంగ్లబోధన వివరాలను వివరిస్తూ భరోసా కల్పించాలని అన్నారు. 15 న విద్యార్థులు పేరెంట్స్, టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వందశాతం పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా సహకారం తీసుకోవాలని అన్నారు. 16 న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం, 17 న మహిళా సంఘాల సమావేశం నిర్వహించి వారి సహకారం తీసుకొని విద్యార్థులు ఎన్రోల్ మెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18 న బాలికల విద్య, కెరీర్ గైడెన్స్ అందించడం, పాఠశాల నుండి వెళ్లిపోయే విద్యార్థుల మనోభావాలు, అనుభవాలను తెలియజేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. 20 వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలని, 21 న స్వచ్ఛ పాఠశాల లో భాగంగా పాఠశాలల్లోని పారిశుద్యం చేపట్టడం, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతులు సౌకర్యవంతం చేసుకోవడం, వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ చేయడం జరగాలన్నారు. 22 న హరితహారం కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించాలన్నారు. 23 న ప్రత్యేక వసతులు కలిగిన విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. 24 న బాలసభ కార్యక్రమని నిర్వహించి మన ఊరు- మన బడి, ఆంగ్ల బోధనలపై వివరించాలని అన్నారు. 25 న గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించాలని, 27 న బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు . 28 న ద్విభాషా పుస్తకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 3 నుండి 30 వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జూన్ 1, 2 తేదీల్లో ముందస్తు సమావేశాలు, ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం, 3 నుండి 10 వ తేదీ వరకు గ్రామాలు, హాబిటేషన్ లలో బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం, 13 నుండి 30 వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 13 న విద్యార్థులు పోషకులతో సమావేశం నిర్వహించి మన ఊరు-మన బడి కార్యక్రమ విషయాలు తెలియజేయడం, అలాగే పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై విద్యార్థులు తల్లితండ్రులకు తెలియజేయాలని అన్నారు. 14 న ఆంగ్లబోధన వివరాలను వివరిస్తూ భరోసా కల్పించాలని అన్నారు. 15 న విద్యార్థులు పేరెంట్స్, టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వందశాతం పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా సహకారం తీసుకోవాలని అన్నారు. 16 న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం, 17 న మహిళా సంఘాల సమావేశం నిర్వహించి వారి సహకారం తీసుకొని విద్యార్థులు ఎన్రోల్ మెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 18 న బాలికల విద్య, కెరీర్ గైడెన్స్ అందించడం, పాఠశాల నుండి వెళ్లిపోయే విద్యార్థుల మనోభావాలు, అనుభవాలను తెలియజేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. 20 వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలని, 21 న స్వచ్ఛ పాఠశాల లో భాగంగా పాఠశాలల్లోని పారిశుద్యం చేపట్టడం, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతులు సౌకర్యవంతం చేసుకోవడం, వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ చేయడం జరగాలన్నారు. 22 న హరితహారం కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించాలన్నారు. 23 న ప్రత్యేక వసతులు కలిగిన విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. 24 న బాలసభ కార్యక్రమని నిర్వహించి మన ఊరు- మన బడి, ఆంగ్ల బోధనలపై వివరించాలని అన్నారు. 25 న గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించాలని, 27 న బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు . 28 న ద్విభాషా పుస్తకాలపై అవగాహన కల్పించాలన్నారు. 29 న డిజిటల్ విద్యపై వివరించాలన్నారు. 30 న లెక్కలు, సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ గ్రామాల ప్రజలు, పాఠశాల యాజమాన్యాలు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాల సహకారాలతో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post