DPRO ADB -బతుకమ్మ పండుగ వేడుకలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవాలి- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.సునీత.

బతుకమ్మ పండుగ వేడుకలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.సునీత అన్నారు. శుక్రవారం రోజున స్థానిక కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలకు బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంబరాలను ఘనంగా ఆటపాటలతో నిర్వహించుకోవాలని అన్నారు. బతుకమ్మ వేడుకలను ప్రోత్సహించడానికి కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, మహిళా సిబ్బంది తో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తొలుత బతుకమ్మకు పూజ కార్యక్రమాలు నిర్వహించి, ఆటపాటల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డి.మాధవి కృష్ణ, ఎం. సతీష్ కుమార్, ప్రమీల జైన్, మంజుల సూర్యవార్, యశ్వంత్ సింగ్, క్షమా దేశ్ పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.నగేష్, ఉపాధ్యక్షులు టి. చందు సింగ్, జాయింట్ సెక్రెటరీ వెండి భద్రేశ్వర్ రావు, మహిళలు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post