DPRO ADB-బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ బద్దంగా మహిళలందరూ నిర్వహించుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బతుకమ్మ వేడుకలను సాంప్రదాయ బద్దంగా మహిళలందరూ నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ ను బతుకమ్మ లతో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు స్వాగతం పలికారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బతుకమ్మలకు సాంప్రదాయ పూజ కార్యక్రమాలు నిర్వహించి బతుకమ్మ ఆటలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలందరూ బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు సాంప్రదాయ దుస్తులలో బతుకమ్మలను పేర్చుకొని అందరు కలిసి బతుకమ్మ ఆటలో పాల్గొంటారని అన్నారు. విద్యార్థులందరూ బతుకమ్మ ఆటల్లో ఆడుతూపాడుతూ సాంప్రదాయ బద్దంగా నిర్వహించడం జరుగుచున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి సి.రవీందర్ కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post