DPRO ADB-బాలికలు అన్ని రంగాలలో ప్రతిభ కనబరచాలి- జాతీయ మైనారిటి కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహెజాది.

బాలికలు అన్ని రంగాలలో ప్రతిభ కనబరచాలని జాతీయ మైనారిటి కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహెజాది అన్నారు. సోమవారం రోజున బంగారుగూడ లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ, విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడం ద్వారా విద్యలో ప్రతిభను సాధిస్తారని, అధ్యాపక బృందం ప్రోత్సాహంతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. బాలికలు పిన్న వయసులోనే విద్యాభ్యాసంలో రాణించడం ద్వారా సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరచవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న ఉపకార వేతనాలను సద్వినియోగ పరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక విద్యార్థిని ఆరోగ్యాంగా ఉంటూ మంచిగా చదువుకోవాలని అన్నారు. కుటుంబ ఆర్థిక సమస్యలను మహిళా పరిష్కరిస్తుందని అభివర్ణించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, స్వామి వివేకా నంద వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోని ఉన్నత స్థానాలను అధిగమించాలని ఆకాంక్షించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం, విద్యార్థులతో పాటు క్యూలో నిలుచొని భోజనాన్ని స్వీకరించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసే సమయంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, వారిలో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ కు వచ్చిన ప్రతి సారి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని తెలిపారు. అనంతరం భోజన శాల, స్టోర్ రూమ్, వసతి గృహం, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులు ఆడుకునే క్యారం బోర్డ్ ఆటను ఆడారు. అనంతరం జాతీయ గణిత దినోత్సవం సందర్బంగా డిసెంబర్ 22 న నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, మెమొంటోలను, శీతాకాలం సందర్బంగా విద్యార్థినిలకు బ్లాంకెట్ లను కమిషన్ సభ్యురాలు అందజేశారు. అంతకు ముందు కమిషన్ సభ్యురాలికి పాఠశాల విద్యార్థినిలు స్కౌట్ విన్యాసంతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపాల్ EG రజని, అధ్యాపకురాల్లు, విద్యార్థులు, మైనారిటి సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post