DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద ఎంపికైన విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలు పొందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఒకటి, ఐదవ తరగతి లలో చేరుకునే ఎస్సీ అభ్యర్థులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద ఎంపికైన విద్యార్థులు ఉచితంగా విద్యాబోధన చేయడం జరుగుతుందని, వారికి అయ్యే ఖర్చులు ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించాలని అన్నారు. మొదటి తరగతిలో 17 సీట్లకు గాను ఆరు సీట్లు బాలికలకు కేటాయించగా 11 సీట్లను జనరల్ కేటగిరిలో లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఐదవ విద్యార్థులకు 17 సీట్లకు గాను ఆరు సీట్లు బాలికలకు కేటాయించగా, 11 సీట్లను జనరల్ కేటగిరిలో లాటరీ పద్ధతిన ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒకటి, ఐదవ తరగతిలలో ఐదు మంది అభ్యర్థుల చొప్పున వెయిటింగ్ లిస్ట్ నకు గాను లాటరీ పద్ధతిన ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులలో వివిధ కారణాల వలన పాఠశాలలో చేరక పోయినచో అట్టి సీట్లను వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆదిలాబాద్ లో మూడు, ఉట్నూర్ లోని మూడు పాఠశాలల్లో ఈ పథకం క్రింద విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ సంక్షేమ శాఖ అద్వర్యం లోని వసతి గృహాలలో చేరుకునేందుకు ప్రచారం నిమిత్తం కరపత్రాలను, సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న ప్రచార ఫ్లెక్సీ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, సహాయ సంక్షేమ అధికారి నారాయణ్ రెడ్డి, రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా సమన్వయ కర్త శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు నలంద ప్రియా, కార్యాలయ పర్యవేక్షకులు పూర్ణచందర్, సీనియర్ అసిస్టెంట్ అర్చన, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post