DPRO ADB – బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకొని వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకొని వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని జనార్దనరెడ్డి గార్డెన్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. నటరాజ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా లో వివిధ బ్యాంకులు అందిస్తున్న విద్య, గృహ, వాహన, వ్యవసాయ, వ్యాపారం తదితర రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు ఆర్థిక నేరాలకు గురికావద్దని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు బ్యాంకులు అందిస్తున్నరుణాలపై పూర్తీ ఆవాహన కలిగి ఉండాలని అన్నారు. రుణాలు పొందినవారు సమయానికి రుణాలను తిరిగి చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ముద్ర, ఎస్సి, ఎస్టీ, మహిళా సంఘాలకు స్త్రీనిధి తదితర రుణాలు అందించడం జరుగుతుందని వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేడు బ్యాంకుల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. బ్యాంకులు అందిస్తున్నవివిధ వ్యాపార, విద్య, వ్యవసాయ తదితర రుణాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలన్నారు. అనంతరం వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను లబ్దిదారులకు అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో LDM చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ పద్మ భూషణ రాజు, వివిధ బ్యాంకు అధికారులు, వినియోగదారులు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post