DPRO ADB- మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను వెంటనే ప్రారంభించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున తన క్యాంప్ కార్యాలయం నుండి మన ఊరు-మన బడి కార్యక్రమం పనులపై విద్య శాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్, మండల ప్రత్యేక అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న రెండు, మూడు రోజుల్లో పనులను ప్రారంభించాలని, పరిపాలన అనుమతులు జారీచేయడం జరిగిందని, ఇంజనీరింగ్ అధికారుల ఎస్టిమేట్స్ ప్రకారం 10 శాతం అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీ ఇంజనీరింగ్ అధికారులు ఆయా పాఠశాలలను బుధవారం సందర్శించి పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ల ఆదేశాల ప్రకారం పనులను చేపట్టాలని అన్నారు. 30 లక్షల లోపు విలువగల 34 పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ప్రభత్వం ఈ మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రాధాన్యత తో ప్రారంభించింది అని, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో పనులను ప్రారంభించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, మే 15 నాటికి మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద మంజూరైన పాఠశాలల పనులను గ్రౌండింగ్ చేయాలనీ అన్నారు. ఆయా ఇంజనీరింగ్ ఏజెన్సీ ల ఎస్టిమేట్స్ ప్రకారం పనులు ప్రారంభించాలని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాఠశాల కమిటీలు, ప్రధానోపాధ్యాయులతో పనులపై వివరించాలని సూచించారు. ఇప్పటి వరకు 34 పాఠశాలలకు గాను 20 పాఠశాలకు పది శాతం అడ్వాన్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అధికారులు ఈ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టే పనులకు సోషల్ అడిట్ చేయడం జరుగుతుందని, పనులను ఎస్టిమేట్స్ ప్రకారం నిర్వహించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద పాఠశాలల్లో చేపట్టే మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, కిచన్ షెడ్ నిర్మాణాలకు ఎస్టిమేట్స్ సమర్పించాలని అన్నారు. ప్రత్యేక అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, పంచాయితీ రాజ్ ఈఈ మహావీర్, పాఠశాలల కమిటీ చైర్మన్ లు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, ఆయా ఇంజనీరింగ్ ఏజెన్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post