DPRO ADB – మన ఊరు -మన బడి పనులు ప్రారంభం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన ఊరు -మన బడి కార్యక్రమం క్రింద నిర్వహించే పనులను నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యదర్శి మాట్లాడుతూ, మన ఊరు- మన బడి క్రింద చేపట్టే పనులు ఆయా ఏజెన్సీ ల పర్యవేక్షణ నిర్వహించడం తో పాటు నాణ్యత కలిగి ఉండాలని అన్నారు. వచ్చే విద్య సంవత్సరం నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలు మాడల్ పాఠశాలలుగా రూపొందించాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, అవసరమైన ముడి సరుకు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, మరుగుదొడ్లను ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 207 పనులకు 47 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పాటు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ సంచలకురాలు శ్రీ దేవసేన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా విద్యాశాఖ అధికారిణి టి.ప్రణీత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా రిసోర్స్ పర్సన్ శ్రీపాద్, ఇంజనీరింగ్ ఏజెన్సీ లు, సెక్టోరల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post