DPRO ADB- మహాత్మా బసవేశ్వరుని సేవలు చిరస్మరణీయం- అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్.

మహాత్మా బసవేశ్వరుని సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా గల విగ్రహం వద్ద బసవేశ్వరుని 889 వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, బసవేశ్వరుని చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సమాజానికి బసవేశ్వరుడు చేసిన సేవలు మరువలేనివని, హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఆయన ఒకరని అన్నారు. కర్ణాటకలోని బాగేవాడి లో జన్మించారని, కుల, వర్ణ, లింగ బేధాలు లేవని అందరం సమానమేనని సుమారు 800 ల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు బసవేశ్వరుని జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పవిత్ర రంజాన్, మహాత్మా బసవేశ్వరుని జయంతి సందర్బంగా ప్రజలందరికి జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, తహసీల్దార్ భోజన్న, వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post