DPRO ADB- ముసలి వయసులో టీకా తీసుకోవడానికి ముందుకు రావడం హర్షణీయం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వచ్చిన వంద సంవత్సరాల వాంకడే తానుబాయి, 102 సంవత్సరాలు కలిగిన సాబ్లే కమలాబాయి లను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. భీంపూర్ మండలం తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాంసి-కే గ్రామానికి చెందిన వాంకడే తానుబాయి, గాదిగూడ మండల కేంద్రానికి చెందిన సాబ్లే కమలాబాయి లు వ్యాక్సిన్ తీసుకోవడం అభినందనీయమని, ముసలి వయసులో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం గర్వకారణం అని, వారిని ఆదర్శంగా తీసుకొని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్ అందిస్తున్న వైద్య, ఆశ, అంగన్వాడీ లు వారి పరిధిలోని అర్హత గలవారికి వ్యాక్సిన్ అందించేందుకు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలని అన్నారు. ఈ సందర్బంగా వ్యాక్సిన్ అందించిన ANM , ఆశా, అంగన్వాడీ కార్యకర్త లను కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక మెడికల్ టీమ్ వారి పరిధిలోని వారికీ ముఖ్యంగా నడవలేని, మంచానికి పరిమితమైన వారిని గుర్తించి వారి వద్దకు వెళ్లి వ్యాక్సిన్ అందించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నా అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న ఇరవై రోజుల్లో జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా ప్రకటించుటకు స్వచ్చందంగా ప్రజలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామాల పెద్దలు, స్వచ్చంద సంస్థలు, వివిధ సంఘాలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని అన్నారు.

Share This Post