DPRO ADB- మైనారిటి విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి – జాతీయ మైనారిటి కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహెజాది.

మైనారిటి విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాతీయ మైనారిటి కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహెజాది అన్నారు. సోమవారం రోజున స్థానిక టీటీడీసీ లో వివిధ శాఖల అధికారులు, మైనారిటీ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో చదువుతున్న మైనారిటి విద్యార్థులకు ప్రత్యేక అవసరాలను చెప్పట్టాలని, వారి విద్యాభ్యాసం పట్ల చొరవ చూపాలని అన్నారు. ఇతర భాషలతో పాటు కంప్యూటర్ విద్యను నేర్పించాలని అన్నారు. ఉపకారవేతనాలు, ఇతర సదుపాయాలను ఆయా శాఖల ద్వారా సమకూర్చేవిధంగా సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్, ఉపకార వేతనాలు సకాలంలో అందేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్య పట్ల ప్రధానమంత్రి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన అంశం ఆయా అధ్యాపకులకు తెలిసి ఉండాలని, జిల్లాకు సంబంధించిన మైనారిటి వివరాలు జిల్లా అధికారికి తెలిసి ఉండాలని అన్నారు. డ్రాప్ అవుట్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. అంతకుముందు మైనారిటి, షెడ్యూల్డు కులాలు, వెనకబడిన తరగతులు, స్త్రీ శిశు సంక్షేమం, షాదీ ముబారక్, వంటి కార్యక్రమమాలపై ఆయా శాఖాదికారులు వివరించారు. ఉట్నూర్ దర్గా వద్ద మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి సౌకర్యాలను కల్పించాలని మైనారిటి సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, మైనారిటి సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, బీసీ సంక్షేమ అధికారి రాజలింగం, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post