DPRO ADB- మొదటి రోజు ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ప్రశాంతం -అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్.

ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం రోజున ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయిన దృష్ట్యా పలు పరీక్షల కేంద్రాలను వారు పరిశీలించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విద్యార్ధి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, పరీక్షల నిర్వహణ, తదితర అంశాలపై ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లను అడిగి తెలుసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని అన్నారు. మొదటి రోజున జరిగిన పరీక్షకు సెట్-ఏ ప్రశ్నపత్రాన్ని విద్యార్థులకు అందజేయడం జరిగిందని తెలిపారు. 10,278 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 9,490 (91 శాతం) మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరు అయ్యారని తెలిపారు. ఇందులో 8639 మంది జనరల్ విద్యార్థులు, 851 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరు అయినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన బందోబస్తు, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగిందని, అలాగే జిరాక్స్ కేంద్రాలలో పరీక్షా నిర్వహణ సమయంలో మూసి వేయడం జరిగిందని తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాలలో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని తెలిపారు. వారి వెంట జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి సి.రవీందర్, ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, పరీక్షాల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post