DPRO ADB -యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ పంపిణి జరగాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఓమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందక ముందే జిల్లాలోని అర్హులైన ప్రజలందరికి డబుల్ డోస్ వ్యాక్సిన్ అందించే దిశగా ప్రణాళికలతో అధికార యంత్రాంగం కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ పట్టణ వార్డుల ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, మున్సిపల్ అధికారులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో వందశాతం వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమాన్ని రానున్న 20 రోజుల్లో పూర్తిచేయాలని అన్నారు. పట్టణ ప్రాంతంలోని 49 వార్డుల లోని 172 కాలనీలలో నివసిస్తున్న అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ పంపిణి జరగాలని, ప్రతి కాలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని మునిసిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ప్రతి వార్డులో రోజుకు రెండువందల చొప్పున, మున్సిపల్ పరిధిలో రోజుకు 10 వేల మందికి వ్యాక్సిన్ అందించాలని అన్నారు. చౌకధరల దుకాణం వద్ద సిబ్బందిని నియమించి సరుకులు తీసుకుంటున్న వారి జాబితా ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా అనే వివరాలను సేకరించి, వ్యాక్సిన్ తీసుకోని వారికీ ఇప్పించాలని అన్నారు. అలాగే ఫించన్ ల పంపిణి సమయంలో లబ్దిదారులను వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా అనే వివరాలను కూడా సేకరించి ఇప్పించాలని సూచించారు. ఆయా వార్డులలో వందశాతం పూర్తయినట్లు సంబంధిత కాలనీ నోడల్ అధికారి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, వాటిని ర్యాండమ్ పరిశీలన జరిపి వార్డ్ నోడల్ అధికారి ద్రువీకరించాలని అన్నారు. పట్టణంలో మెప్మా సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది సహకారం తీసుకోవాలని అన్నారు. కొంతమంది అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వారిని ఈ సందర్బంగా అభినందించాలని అన్నారు. అనంతరం ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓలతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 126 సబ్ సెంటర్ లు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి సబ్ సెంటర్ పరిధిలో రోజుకు వందమందికి చొప్పున వ్యాక్సిన్ నిర్వహించాలని అన్నారు. ప్రతి హాబిటేషన్ కు నోడల్ అధికారిని నియమించాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇంచార్జి అధికారిని నియమించాలని అలాగే ప్రతి సబ్ సెంటర్ కు నోడల్ అధికారిని నియమించాలని వైద్య అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో రోజుకు పదివేల చొప్పున వ్యాక్సినేషన్ అందించాలని అన్నారు. ఆయా గ్రామాలలో వందశాతం పూర్తయినట్లు పరిశీలించుకుని ధ్రువీకరణ పత్రం గ్రామ నోడల్ అధికారి సమర్పించాలని అన్నారు. ఇప్పటి వరకు మొదటి డోస్ తీసుకోని వారికీ వ్యాక్సిన్ అందించడం, నియమిత కాల ప్రకారం రెండవ డోస్ వేసుకునే విధంగా జాబితా ప్రకారంగా అందించాలని అన్నారు. చౌకధరల దుకాణం వద్ద సిబ్బందిని నియమించి సరుకులు తీసుకుంటున్న వారి జాబితా ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా అనే వివరాలను సేకరించి, వ్యాక్సిన్ తీసుకోని వారికీ ఇప్పించాలని అన్నారు. అలాగే ఫించన్ ల పంపిణి సమయంలో లబ్దిదారులను వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా అనే వివరాలను కూడా సేకరించి ఇప్పించాలని సూచించారు. మోటివేషన్ కార్యక్రమం లో భాగంగా కరపత్రాలను పంపిణి చేయాలనీ, వివిధ భాషలలో తయారుచేసిన వాయిస్ మెసేజ్ లను మున్సిపల్, గ్రామపంచాయితీ చెత్త సేకరణ ట్రాక్టర్ల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. కమ్యూనిటీ మొబలైజర్ ల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, సామజిక దూరం పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న శాశ్వత, తాత్కాలిక సిబ్బంది రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్న వివరాలను సమర్పించాలని అన్నారు. ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితా ప్రకారం వారిని ప్రేరేపిస్తూ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మోటివేటర్ల సహకారం తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, పట్టణంలోని వార్డ్ ప్రత్యేక అధికారులు, కాలనీ నోడల్ అధికారులు, గ్రామీణ ప్రాంతం లోని గ్రామ, సబ్ సెంటర్, పీహెచ్ సి నోడల్ అధికారులను నియమించి వ్యాక్సినేషన్ వంద శాతం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మిషన్ మోడ్ లో వ్యాక్సినేషన్ జరగాలని అన్నారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, ఏరోజుకారోజు నివేదికలు సమర్పించాలని అన్నారు. గ్రామాలు, వార్డులలో వందశాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశలలో మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయసారథి, ఆదిలాబాద్ పట్టణ వార్డుల ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post