DPRO ADB- రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణి చేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్యెల్యే జోగు రామన్న.

పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలతో పాటు రంజాన్ పండుగను సాంప్రదాయ బద్దంగా భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున స్థానిక పుత్లిబౌలి ఉర్దూ ఘర్ షాదీ ఖానాలో ఎమ్యెల్యేతో కలిసి ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా సందర్బంగా గత రెండు సంవత్సరాలుగా రంజాన్ పండుగ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించలేక పోయామని, ఈ సంవత్సరం అధికారికంగా గిఫ్ట్ ప్యాకెట్ ల పంపిణీ చేయడంతో పాటు ఇఫ్తార్ విందు కార్యక్రమాలను నిర్వహించుకోనున్నామని తెలిపారు. జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించుకొని రంజాన్ పండుగ ఏర్పాట్లపై చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పండుగ నేపథ్యంలో ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులను నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. రంజాన్ పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, పేద ముస్లింకు కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాకెట్ లను అందిస్తున్నదని తెలిపారు. జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకవర్గంలో 3000, బోథ్ నియాజక వర్గంలో 1500 వందల ప్యాకెట్లను పంపిణి చేయడం జరుగుచున్నదని తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం ఆదిలాబాద్ నియోజక వర్గానికి ఆరు లక్షలు, బోథ్ నియోజక వర్గానికి మూడు లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సమిష్టి కృషితోని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని వివరించారు. రంజాన్ పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. అనంతరం ముస్లిం కుటుంబాల వారికీ గిఫ్ట్ ప్యాకెట్లను కలెక్టర్, ఎమ్యెల్యే లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post