DPRO ADB -రాజీవ్ స్వగృహ ప్లాట్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలానికి సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున మావల మండలంలో బట్టి సావర్గం పరిధిలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ స్వగృహ ప్లాట్ల విస్తీర్ణం 28.37 ఎకరాలలో 362 ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, బహిరంగవేలం వేయడానికి డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్ అనుమతులు రావడం జరిగిందని తెలిపారు. ప్లాట్లలో అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అంతర్గత పనులు వారం రోజుల్లోగా పూర్తిచేసి బహిరంగ వేలానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రాజస్వ మండల అధికారి రమేష్ రాథోడ్, మావల తహసీల్దార్ వనజ రెడ్డి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కిరణ్, తదితరులు ఉన్నారు.

Share This Post