DPRO ADB-రాజీవ్ స్వగృహ లే అవుట్ లో మౌళిక సదుపాయాల పనులు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాజీవ్ స్వగృహ లే అవుట్ లో మౌళిక సదుపాయాల పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున మావల మండలంలోని బట్టి సావర్గం శివారులోని రాజీవ్ స్వగృహ లే అవుట్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ స్వగృహ లే అవుట్ లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్ లు, త్రాగు నీరు వంటి మౌళిక సదుపాయాల కల్పనకు పనులు చేపట్టాలని, అవసరమైన ఎస్టిమేట్ లు సిద్ధం చేయాలనీ అన్నారు. ఈ నెలాఖరు నాటికి రాజీవ్ స్వగృహ లే అవుట్ లోని ప్లాట్ల బహిరంగవేళానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఐటి టవర్ నిర్మాణానికి అనువైన స్థలం కోసం సర్వే నంబర్ 72 లో పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, లే అవుట్ నుండి కలెక్టరేట్ నిర్మాణ ప్రాంతం వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారుచేసి జాతీయ రహదారుల శాఖకు పంపించేందుకు ఆర్ అండ్ బి అధికారులు ఎస్టిమేట్ సిద్ధం చేయాలనీ సూచించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి అంతర్గత పనులను పూర్తిచేయాలని మున్సిపల్, విద్యుత్, తదితర శాఖలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్, రోడ్లు భవనాలు శాఖ డిఈఈ సురేష్, టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ స్వామి, జెఈఈలు శివకృష్ణ, రాజ్ కుమార్, తహసీల్దార్ వనజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post