DPRO ADB -రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ చేసిన అధికారులు, ఉద్యోగులు

ఆజాది కా అమృత్ మహోత్సవాలలో భాగంగా నవంబర్ 26 న 72వ భారత రాజ్యంగ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ఉద్యోగులచే శుక్రవారం రోజున కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి , పౌరులందరికి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయన్ని , ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని, చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి , 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపికచేసికొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సముపార్జించుకున్నాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో డి.పి.ఆర్. ఎన్.భీమ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, రాజేశ్వర్, స్వాతి, నలంద ప్రియా, తహసీల్దార్ రాంరెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post