DPRO ADB-రిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య చికిత్సలతో పాటు సాధారణ ప్రసవాలను పెంచాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య చికిత్సలతో పాటు సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ డాక్టర్లను ఆదేశించారు. బుధవారం రిమ్స్ ఆసుపత్రిలోని ENT, ప్రసూతి వార్డులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ లో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సాధారణ ప్రసవాలకు తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రిమ్స్ ఆసుపత్రి లలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని అన్నారు. సాధారణ ప్రసవాల ను ప్రోత్సహించాలని, శస్త్ర చికిత్స వలన కలిగే అనర్దాలను, సాధారణ ప్రసవాల కలిగే లాభాలపై గర్భిణీలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రసూతి వార్డులో పని చేసే వైద్యులు, సిబ్బంది పని తీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.
సాధారణ ప్రసవను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రసూతి విభాగం లో పోస్టర్ల ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post