DPRO ADB -రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు నవీన్ మిట్టల్,

స్థానిక సంస్థల ఎమ్యెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా ఎన్నికల నియమావళి మేరకు నిర్వహించాలని సాధారణ పరిశీలకులు నవీన్ మిట్టల్ అన్నారు. స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేయనున్న ఏర్పాట్లను గురువారం రోజున కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఎమ్యెల్సీ ఎన్నికల నేపథ్యంలో రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ ఎన్నికల సందర్బంగా టీటీడీసీలో ఏర్పాట్లను చేపట్టడానికి నిర్ణయించడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, DRDO కిషన్, అదనపు DRDO రవీందర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post