థర్డ్ వేవ్ దృష్ట్యా జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జై భీం నగర్ కాలనిలో మంగళవారం రోజున నిర్వహించిన వాక్సినేషన్ కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వందశాతం వ్యాక్సినేషన్ కోసం అధికారులు, మెడికల్ టీమ్ లు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తూ పూర్తి చేయాలనీ అన్నారు. ఇప్పటివరకు గుడిహత్నూర్ మండల కేంద్రంలో 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, కరోనా వ్యాప్తి నిర్మూలనకు వ్యాక్సిన్ తీసుకోవడం, మాస్క్ ధరించడం, తరచు చేతులు శుభ్రపరచడం, సామాజిక దూరం పాటించడం వంటివి పాటించాలని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే కరోనా జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ పై పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీఓ సునీత, మెడికల్ టీమ్ లు, వైద్య సిబ్బంది, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- వందశాతం వ్యాక్సినేషన్ కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.