DPRO ADB- వచ్చే సంవత్సరం నాగోబా జాతర నాటికీ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తాం- రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి:, గిరిజనుల ఇలవేల్పుల జాతరలకు, దేవాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నది – రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

వచ్చే సంవత్సరం నాగోబా జాతర నాటికీ దేవాలయ నిర్మాణం పూర్తీ చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం రోజున ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మంత్రులకు జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి, ప్రజాప్రతినిధులు పూల మొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నాగోబా దేవతకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మెస్రం వంశీయులు నాలుగు కోట్ల రూపాయలు జమ చేసి దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని, దేవాదాయ శాఖ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల రాయితో దేవాలయ నిర్మాణం అద్భుతంగా జరుగుచున్నదని తెలిపారు. యాదగిరి గుట్ట దేవాలయ నిర్మాణం మాదిరిగా నాగోబా దేవాలయాన్ని నిర్మించడం జరుగుచున్నదని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా నాగోబా జాతర సందర్బంగా దర్బార్ ను నిర్వహించలేక పోయామని తెలిపారు. దర్బార్ లో గిరిజనుల సమస్యలు జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి నేతృత్వంలో పరిష్కరించడం జరుగుచున్నదని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల పనులకు ఇరవై శాతం కాంట్రిబ్యూషన్ తో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదని తెలిపారు. గిరిజనులకు సంక్రాంతి, నాగోబా జాతర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వారు ఆరాధించే ఇలవేల్పులైన సమ్మక్క సారలమ్మ, నాగోబా, సేవాలాల్ మహారాజ్ జాతరలు, వేడుకలను అధికారికంగా ప్రభుత్వ నిధులతో నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. నాగోబా దేవాలయ నిర్మాణ పనులు పరిశీలించి, పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన ఆదివాసీ, లంబాడీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు. మెస్రం వంశీయులు నాలుగు కోట్ల రూపాయలు పోగు చేసి దేవాలయ నిర్మాణానికి తమవంతు సహకారం అందించారని, ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను వచ్చే జాతర నాటికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడం, దూపదీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఏడేళ్ల కాలంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 350 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఈ సందర్బంగా తెలిపారు. జోడేఘాట్ లో 26 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. రామప్ప, వేయి స్తంభాల దేవాలయం తరహాలో నాగోబా దేవాలయ నిర్మాణం జరుగుచున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, నిర్మల్ జడ్పీ చైర్మన్ లు రాథోడ్ జనార్దన్, విజయ లక్ష్మి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఎమ్యెల్యేలు రేఖా శ్యాం నాయక్, రాథోడ్ బాపూరావు, మాజీ ఎంపీ గెడం నగేష్, స్థానిక సర్పంచ్ మెస్రం రేణుక నాగనాథ్, మెస్రం వంశీయులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post